logo
Published : 02/12/2021 03:08 IST

రాష్ట్ర పోటీలకు ఇనుమెళ్ల విద్యార్థి ఎంపిక


నాగ సంజయ్‌కి బహుమతి అందజేస్తున్న ఆర్జేడీ సుబ్బారావు

ఈపూరు, న్యూస్‌టుడే: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌- 2021 పోటీల్లో ఈపూరు మండలం ఇనుమెళ్ల జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్‌.నాగసంజయ్‌ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లాస్థాయి పోటీలు మంగళవారం గుంటూరులో జరిగాయి. గైడ్‌ టీచర్‌ ఎం.ధనయ్య ఆధ్వర్యంలో పాఠశాలకు చెందిన 13మంది విద్యార్థులు ఈ పోటీల్లో వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇనుమెళ్లకు చెందిన నాగ సంజయ్‌ ‘ప్లాస్టిక్‌ పెట్రోలు’ అంశంపై ప్రాజెక్టును సమర్పించి ప్రథమ స్థానంలో నిలిచాడు. 13 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయగా అందులో నాగ సంజయ్‌ ఉన్నాడు. డిసెంబరు 14, 15తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడని గైడ్‌ టీచర్‌ ఎం.ధనయ్య తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల హెచ్‌ఎం హెచ్‌ శ్రీనివాస్‌ అభినందించారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని