logo

పారదర్శకంగా బదిలీ ప్రక్రియ

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా పరిశీలకులు, పాఠ్య పుస్తక విభాగ సంయుక్త సంచాలకులు శ్రీనివాసచారి స్పష్టం చేశారు.

Published : 05 Feb 2023 04:23 IST

ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న ఉమ్మడి జిల్లా పరిశీలకులు శ్రీనివాసచారి

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఉమ్మడి జిల్లా పరిశీలకులు, పాఠ్య పుస్తక విభాగ సంయుక్త సంచాలకులు శ్రీనివాసచారి స్పష్టం చేశారు. శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చిన ఆయన బదిలీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఉపాధ్యాయుల బదిలీ హార్డ్‌కాపీలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. లోకల్‌బాడీ యాజమాన్య పరిధిలో పదోన్నతి కోసం ధ్రువపత్రాల పరిశీలనకు 63 మందికి 60 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఆ పరిశీలన ప్రక్రియను వీక్షించి పలు సూచనలు చేశారు. ఏవైనా పొరపాట్లు దొర్లినా ఆ తర్వాత అభ్యంతరాలకు అవకాశముంటుందని చెప్పారు. డీఈవో ప్రణీత, ఏడీ నర్సిములు తదితరులు ఉన్నారు.


1,537 మంది దరఖాస్తులు

బదిలీల కోసం ఆన్‌లైన్‌లో 1,537 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు లెక్కతేల్చారు. దరఖాస్తు చేసుకుని ఎంఈవోలకు సమర్పించిన హార్డుకాపీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. తొలుత 1,600 మంది దరఖాస్తులు చేసినట్లుగా తెలిసిన కొందరు హార్డుకాపీలు సమర్పించలేదని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని