logo

Mancherial: అమిత్‌షా అని ఆపారు.. వెంటనే పంపించారు

అంబులెన్స్‌(అత్యవసర వాహనం)వస్తుందంటే.. ఏ స్థాయి వ్యక్తి అయినా దారి ఇవ్వాల్సిందే. అలాంటి సంఘటనే సోమవారం భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మంచిర్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా చోటుచేసుకుంది.

Updated : 28 Nov 2023 08:08 IST

న్యూస్‌టుడే, మంచిర్యాల సిటీ: అంబులెన్స్‌ (అత్యవసర వాహనం)వస్తుందంటే.. ఏ స్థాయి వ్యక్తి అయినా దారి ఇవ్వాల్సిందే. అలాంటి సంఘటనే సోమవారం భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మంచిర్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా చోటుచేసుకుంది. సరిగ్గా రైల్వే పైవంతెన వద్ద మంత్రి కాన్వాయ్‌ దిగుతుండటం, ఎదురుగా అంబులెన్స్‌ రావడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయారు. నిలిపివేయాలా.. పంపించాలనే ఆలోచిస్తూనే ఒక్క నిమిషం ఆపివేశారు. బాధిత వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో అంటూ ఆందోళనతో వెంటనే పంపించారు. భాజపా అభిమానులు స్పందిస్తూ అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు సహకరించడం విశేషం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని