logo

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు.

Published : 26 Apr 2024 12:04 IST

ఎదులాపురం: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ 138వ మేడేను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో మేడే కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా కుదించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను ఓడించాలని ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని