logo

ఫ్లెక్సీల ఏర్పాటుపై ఫిర్యాదు

ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు.

Updated : 29 Apr 2024 15:36 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పార్టీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులకు భాజపా నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు జోగు రవి మాట్లాడుతూ.. ప్రధాని హోదా స్థాయిలో ఉన్న వ్యక్తిపై అనుచిత ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన విధానం కాదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని