logo

అడవిలో 3 కి.మీ. నడవాల్సిందే..

వేమనపల్లి మండలంలోని బొమ్మెన, చామనపల్లి గ్రామానికి చెందిన ఓటర్లకు అడవిలో 3 కి.మీ. కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి.

Updated : 01 May 2024 05:41 IST

బొమ్మెన గ్రామ గిరిజనులు

వేమనపల్లి మండలంలోని బొమ్మెన, చామనపల్లి గ్రామానికి చెందిన ఓటర్లకు అడవిలో 3 కి.మీ. కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. చామనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొమ్మెన, బద్దంపల్లి గ్రామాలున్నాయి. మొత్తం 957 మంది ఓటర్లు ఉన్నారు. చామనపల్లి, బొమ్మెన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో పోలింగ్‌ కేంద్రాన్ని బద్దంపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చామనపల్లి, బొమ్మెన గ్రామస్థులు 3 కి.మీ. దూరంలోని బద్దంపల్లికి అడవి మార్గంలో కాలినడకన మధ్యలో వాగు దాటి వెళ్లాలి. అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయతీ ఎన్నికలు ఏవైనా తమకు కాలినడక కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు.

 న్యూస్‌టుడే, వేమనపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని