logo

ఓటు వేసేదెలా?

ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 08 May 2024 03:50 IST

పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : ఒకవైపు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంటింటికి వెళ్లి కదల్లేని వయోవృద్ధులు, దివ్యాంగులకు అవకాశం కల్పిస్తున్న అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో కీలక భూమిక పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల విషయంలో నిర్లక్ష్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 13న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే పంచాయతీల్లో అందుబాటులో ఉండి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులలో ఉన్న వారికి పోస్టల్‌ ద్వారా ఓటు వేసేలా దరఖాస్తు చేసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సూచించారు. అందరిలా పంచాయతీ కార్యదర్శులు సైతం పోస్టల్‌ ఓటుకు సంబంధించి ఫారం 12 పూరించి ఇచ్చినా విధుల కేటాయింపు పత్రం ఇవ్వని కారణంగా వారి దరఖాస్తులను తిరస్కరించారు. బుధవారంతో పోస్టల్‌ ఓటు వినియోగ గడువు ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా 334 మంది పంచాయతీ కార్యదర్శులు ఉండగా.. వారిలో ఏ ఒక్కరు పోస్టల్‌ ఓటును వినియోగించుకోలేకపోయారు. ఆయా పంచాయతీల్లో విధులు నిర్వహించే వారంతా వేరే ప్రాంతం వారు కావడంతో ఓటు ఒక చోట.. విధులు మరోచోట ఉండటంతో ఓటు వినియోగం ఎలాగనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలువురు అధికారులను కలిసినా తమకేం తెలియదని చేతులెత్తేయడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. అందరికీ ఓటు వేయమని ప్రచారం చేసిన తామే ఓటు వినియోగానికి దూరమవుతుండటంతో మనోవేదనకు గురవుతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు పోస్టల్‌ ఓటు విషయమై ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి ఫణిందర్‌రావును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. తనకేం తెలియదని, కలెక్టరేట్లో సంప్రదించాలని సమాధానం ఇవ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు