logo

నిషేధమా.. నీవెక్కడ?

పాలిథిన్‌, ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్‌ను పూర్తిగా నిషేధించాలని అధికార యంత్రాంగం ఒక వైపు ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో

Published : 30 Mar 2023 03:10 IST

లోతుగెడ్డ కూడలి సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన చెత్త తొట్టెలు

చింతపల్లి, న్యూస్‌టుడే: పాలిథిన్‌, ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటనలకే పరిమితమవుతోంది. పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్‌ను పూర్తిగా నిషేధించాలని అధికార యంత్రాంగం ఒక వైపు ఆదేశాలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావడం లేదు. ప్రధానంగా పర్యటక ప్రాంతాల్లో వీటి వినియోగం మరింత విచ్చలవిడిగా సాగుతోంది. చింతపల్లి మండలం లంబసింగి, తాజంగితోపాటు లోతుగెడ్డ కూడలి సమీపంలోని కృష్ణాపురం వద్ద అటవీశాఖకు చెందిన వనాల్లో మందుబాబులు తాగి పడేసిన సీసాలు, తాగునీటి బాటిళ్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు, పాలిథిన్‌ సంచులు కనిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు ప్లాస్టిక్‌, పాలిథిన్‌ను నిషేధించాలని, చెత్తతొట్టెలను వినియోగించాలని కోరుతూ పలు చోట్ల వీటిని ఏర్పాటు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని