logo

‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం

విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్‌ ఎస్‌.రాజారెడ్డి తెలిపారు.

Published : 27 Apr 2024 01:16 IST

ఎన్‌ఏడీకూడలి(కాకానినగర్‌), న్యూస్‌టుడే : విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్‌ ఎస్‌.రాజారెడ్డి తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి థాయ్‌ ఎయిర్‌ఏసియా ద్వారా మలేసియాకు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలాలంపూర్‌ నుంచి రాత్రి 9:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విమానం, తిరిగి 10 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారుజాము 4:20 గంటలకు కౌలాలంపూర్‌ చేరుతుందన్నారు. పర్యాటకులు వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యంతో కౌలాలంపూర్‌ను సందర్శించే అవకాశం ఉందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విమానాశ్రయ సలహా కమిటీ సభ్యులు కె.కుమార్‌రాజా, ఓ.నరేశ్‌కుమార్‌, డి.ఎస్‌.వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని