logo

సమగ్రాభివృద్ధికి తెదేపా మేనిఫెస్టో దోహదం

రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఇటీవల తెదేపా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దోహదపడుతుందని, ఆ పథకాలతో తెదేపా ప్రభంజనం సృష్టించబోతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి, పరిశీలకుడు వేణుగోపాల్‌ రాయుడు అన్నారు.

Published : 10 Jun 2023 02:13 IST

తెదేపాలో చేరిన వారిని కండువా కప్పి ఆహ్వానిస్తున్న పరిశీలకుడు వేణుగోపాల్‌ రాయుడు, వంతల రాజేశ్వరి

ఎటపాక, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఇటీవల తెదేపా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో దోహదపడుతుందని, ఆ పథకాలతో తెదేపా ప్రభంజనం సృష్టించబోతోందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వంతల రాజేశ్వరి, పరిశీలకుడు వేణుగోపాల్‌ రాయుడు అన్నారు. ఎటపాకలోని తెదేపా అరకు పార్లమెంట్‌ కార్యదర్శి మువ్వా శ్రీనివాస్‌ నివాసంలో శుక్రవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకుడు వేణుగోపాల్‌ మాట్లాడుతూ  తెదేపా ప్రవేశపెట్టబోతున్న పథకాలను ప్రటి ఇంటికీ చేర్చాలని పిలుపునిచ్చారు. ప్రతి పథకం ఓ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. అనంతరం రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి వైకాపా నిరోధకంగా మారిందని, సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘నామమాత్రంగా పనిచేస్తే ప్రయోజనం లేదు, ఎవరికీ భయపడాల్సి అవసరం లేకుండా పోరాడదాం’ అని పిలుపునిచ్చారు. మండలంలో పార్టీలో చేరిన 25 కుటుంబాలను కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని