logo

ఎన్నికల్లో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు

పోలింగ్‌ సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. బయట బీఎల్వోలు, భద్రతా సిబ్బంది తదితరులుంటారు. కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లలో ప్రత్యేకమైన సాయం కావల్సినవారు ఉంటారు.

Published : 09 May 2024 02:33 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: పోలింగ్‌ సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. బయట బీఎల్వోలు, భద్రతా సిబ్బంది తదితరులుంటారు. కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లలో ప్రత్యేకమైన సాయం కావల్సినవారు ఉంటారు. ఇలాంటి వారి కోసం ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదే సమయంలో పోలీసు శాఖ నుంచి తమకు సాయంగా ఇలాంటి వారు ఉంటే మంచిదని వివరించడంతో కొన్ని కళాశాలలనుంచి వీరిని కేటాయించారు. వీరితో పోలీసు అధికారులు సమావేశమై ఆసక్తి ఉన్నవారి వివరాలను తీసుకున్నారు. ఆయా కళాశాలలకు వారి జాబితాలను పంపించారు. తద్వారా ఎన్‌.సి.సి., ఎన్‌.ఎస్‌.ఎస్‌. విద్యార్థుల వివరాలను తమ పరిధిలోని ఆర్వో కార్యాలయాలకు నోడల్‌ అధికారి ద్వారా పంపించారు. ఈ జాబితాల ఆధారంగా ఆర్వో కార్యాలయం నుంచి ఆమోదం పొంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేస్తున్నారు. ‘పేట’ పరిధిలో ఉన్న కళాశాలకు చెందిన పలువురు సేవా వాలంటీర్లు నక్కపల్లి ఆర్వో కార్యాలయానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళ, పురుష వాలంటీర్లు ఉన్నారు. వీరు ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున ఉంటారు.


ఓటర్ల సేవకే

- కె.గీతాంజలి, ఆర్వో

పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చే వయో వృద్ధులు, దివ్యాంగులు ఏ ఇబ్బందీ లేకుండా ఓటేయడానికి వీలుగా సేవా వాలంటీర్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీరంతా పోలీసుశాఖ ఆధ్వర్యంలోనే ఉంటారు. వీరికి  ప్రత్యేకించి ట్యాగ్‌ ఇస్తాం. ఓటర్లను లోనికి తీసుకెళ్లి, రావడమే కాదు, అవసరమైన వారికి తాగునీరు అందిస్తారు. ఇలా ఓటర్ల సేవలో ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు