logo

అక్రమార్కులకు అధికార పార్టీ అండ

చీడికాడ మండలంలో గ్రావెల్‌ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated : 18 May 2024 02:40 IST

అడవి అగ్రహారంలో పొక్లెయిన్‌తో తవ్వకాలు 

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలంలో గ్రావెల్‌ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీడికాడ మండలంలోని అడవి అగ్రహారం, బైలపూడి, జి.కొత్తపల్లి, చినగోగాడ ప్రాంతాల్లో కంకర గుట్టలున్నాయి. వేసవి కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో గ్రావెల్‌కు డిమాండ్‌ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వేస్తున్నారు. పొక్లెయిన్‌తో రాత్రీ, పగలు తేడాలేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. సాధారణ రోజుల కన్నా.. అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు, సెలవు రోజుల్లో ఈ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది. శుక్రవారం అడవి అగ్రహారం, బైలపూడి ప్రాంతాల్లో  పెద్దఎత్తున తవ్వకాలు చేపట్టారు. భారీ లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులు సైతం పాడవుతున్నాయి. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణంరాజు దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రావెల్‌ తవ్వకాలపై తహసీల్దారుకు నివేదిక పంపుతామని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు