logo

అంతర్‌ రాష్ట్ర వివాదాలు పెంచేందుకు భాజపా యత్నం

అంతర్‌ రాష్ట్ర వివాదాలు పెంచేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావులు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు.

Published : 04 Feb 2023 03:27 IST

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : అంతర్‌ రాష్ట్ర వివాదాలు పెంచేందుకు భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావులు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో ఆరోపించారు. ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలపాలని డిమాండ్‌ చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువున కర్ణాటకలో చేపడుతున్న ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించడం.. ఏపీ హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీలంతా ఈ అంశంపై గళం విప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలని, రాష్ట్ర హక్కులకు భంగం కలగకుండా చూడాలని నేతలు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని