logo

రూ.45 లక్షలే ఇస్తాం

మచిలీపట్నం పోర్టు కోసం నిర్మించనున్న రహదారి భూ సేకరణపై అధికారులకు, రైతులకు మధ్య అంగీకారం కుదరడం లేదు.

Published : 21 Mar 2023 04:48 IST

మచిలీపట్నం రూరల్‌, (న్యూస్‌టుడే): మచిలీపట్నం పోర్టు కోసం నిర్మించనున్న రహదారి భూ సేకరణపై అధికారులకు, రైతులకు మధ్య అంగీకారం కుదరడం లేదు. రైతుల అడిగిన ధరను ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రహదారి కోసం సేకరించిన భూమి గురించి తహసీల్దార్‌, ఆర్డీవోలు ఇటీవల సమావేశాలు నిర్వహించారు. కొందరు రైతులు తమ భూమి రూ.45 లక్షల మార్కెట్‌ రేటు ఉందని, నిబంధనల ప్రకారం రెండున్నర రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను కోరారు. బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు రైతులు ఎక్కువ స్టాంప్‌డ్యూటీ చెల్లించి భూములు అధిక ధర ఉన్నట్లు చూపిస్తున్నారని, పెరిగిన ధరల గురించి తమకు సమాచారం కూడా ఇవ్వలేదని అధికారులు అభ్యంతరం తెలిపారు. ఎకరం రూ.18లక్షలు ధర ఉన్న రైతులు తమకు కోటి రూపాయలు ఇవ్వాలని కోరగా అధికారులు సాధ్యం కాదని తేల్చేశారు. కనీసం రూ.70లక్షలైనా ఇవ్వాలని రైతులు కోరగా అది కూడా సాధ్యం కాదని అధికారులు చెప్పారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో మరో సమావేశం ఉంటుందని, రైతులు ధర గురించి పునరాలోచన చేయాలని అధికారులు సూచించారు. పోతేపల్లిలో 25 ఎకరాలు, మాచవరంలో 4 ఎకరాలకు చెందిన రైతులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని