ట్యూటర్ కొడితే బాలిక చెయ్యి విరిగింది
వసతిగృహంలో ట్యూటర్ కొట్టడంతో ఓ బాలిక చేయి విరిగింది. పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలో 15 రోజుల క్రితం జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
బాలికను విచారిస్తున్న సాంఘిక సంక్షేమాధికారి
జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: వసతిగృహంలో ట్యూటర్ కొట్టడంతో ఓ బాలిక చేయి విరిగింది. పట్టణంలోని సమీకృత బాలికల వసతిగృహంలో 15 రోజుల క్రితం జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణాధికారి తెలిపిన వివరాల మేరకు.. గంపలగూడెం మండలానికి చెందిన ఓ బాలిక జగ్గయ్యపేటలోని వసతిగృహంలో ఉండి పక్కనే ఉన్న జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వసతిగృహంలో ట్యూటర్‌గా పనిచేసే యువతి ఈనెల 7న బాలికను కర్రతో కొట్టడంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. రెండు రోజులైనా నొప్పి తగ్గక పోవడంతో స్నేహితుల ప్రోద్బలంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చేయి విరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించి బాలికను ఇంటికి పంపారు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు గంపలగూడెంలో స్పందనలో ఫిర్యాదు చేయడంతో సాంఘిక సంక్షేమాధికారి విచారణ చేపట్టారు. బాలికను గాయపరిచింది దినసరి వేతనంపై ట్యూటర్‌గా పని చేసే యువతి అని, ఆమెను విధుల నుంచి ఇప్పటికే తొలగించామని వార్డెన్ సుల్తానా వివరణ ఇచ్చారు. గాయపర్చడమే కాకుండా ఇదేమని అడిగిన తమపై ట్యూటర్ అసభ్యంగా మాట్లాడారని కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్