logo

ఇంటి వద్దే ఓటు వినియోగం

మంచం పట్టిన పండుటాకులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌ ఊతమిచ్చింది. ఇంటి వద్దే ఓటు హక్కు (హోమ్‌ ఓటింగ్‌) వినియోగించుకునే అవకాశం కల్పించింది. బారులు తీరే జనం మధ్య.. మండే ఎండల్లో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే పరిస్థితిని తప్పించింది.

Updated : 08 May 2024 05:55 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : మంచం పట్టిన పండుటాకులు, దివ్యాంగులకు ఎన్నికల కమిషన్‌ ఊతమిచ్చింది. ఇంటి వద్దే ఓటు హక్కు (హోమ్‌ ఓటింగ్‌) వినియోగించుకునే అవకాశం కల్పించింది. బారులు తీరే జనం మధ్య.. మండే ఎండల్లో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే పరిస్థితిని తప్పించింది. జిల్లాలో మొత్తం 1052 మంది హోమ్‌ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు. తొలి రోజు 495 మంది ఓటు వేశారు. వీరిలో వృద్ధులు 340 మంది, దివ్యాంగులు 155 మంది ఉన్నారు. ఇంకా 557 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు పర్యవేక్షించారు. నియోజకవర్గాలపరంగా చూస్తే.. విజయవాడ తూర్పులో 88 మంది, సెంట్రల్‌ 46, పశ్చిమ 56, జగ్గయ్యపేట 34, తిరువూరు 42, నందిగామ 37, మైలవరంలో 37 మంది వృద్ధులు ఓటేశారు. దివ్యాంగులకు సంబంధించి విజయవాడ తూర్పు 20, సెంట్రల్‌ 30, పశ్చిమ 29, జగ్గయ్యపేట 11, తిరువూరు 24, నందిగామ 28, మైలవరంలో 13 మంది చొప్ను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


పటమట, న్యూస్‌టుడే : 85 ఏళ్లు నిండిన వృద్ధులు, పోలింగ్‌ బూత్‌కి వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా నేరుగా ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని పటమట పీఅండ్‌టీ కాలనీలో జరుగుతున్న హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి భవానీ శంకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ప్రత్యేక ఎన్నికల బృందం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా ఓటింగ్‌ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 32 బృందాలు హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నాయన్నారు. మంగళవారం నాటికి 90 శాతం ఓటింగ్‌ పూర్తవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు