logo

నమ్మండి... ఇది జగనన్న లేఔటేనండి

ముళ్ల పొదలతో కనిపిస్తున్న ఈ ప్రదేశం జగనన్న లేఔటే నమ్మి తీరాల్సిందే. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నాలుగేళ్ల కిందట రూ.లక్షలు వెచ్చించి 559 మంది (నాగాయలంకకు చెందిన 443 మంది, భావదేవరపల్లికి చెందిన 72 మంది, నంగేగడ్డకు చెందిన 44 మంది)కి అధికారులు నివేశన స్థలాలు కేటాయించారు.

Published : 08 May 2024 04:39 IST

న్యూస్‌టుడే, నాగాయలంక: ముళ్ల పొదలతో కనిపిస్తున్న ఈ ప్రదేశం జగనన్న లేఔటే నమ్మి తీరాల్సిందే. నాగాయలంక మండలం భావదేవరపల్లిలో నాలుగేళ్ల కిందట రూ.లక్షలు వెచ్చించి 559 మంది (నాగాయలంకకు చెందిన 443 మంది, భావదేవరపల్లికి చెందిన 72 మంది, నంగేగడ్డకు చెందిన 44 మంది)కి అధికారులు నివేశన స్థలాలు కేటాయించారు. ఆ తర్వాత అధికారులు మళ్లీ లేఔట్‌ వైపు కన్నెత్తి చూడలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. కనీసం మెరక పనులు కూడా చేయించలేదు. అధికారులు ఆదిలో హడావుడి చేసి నీటి సరఫరాకు గొట్టాలు వేసినా వాటి నుంచి చుక్క నీరు రాలేదని వాపోతున్నారు. నాగాయలంకకు చెందిన అర్హులకు 10 కిలోమీటర్ల దూరంలోని భావదేవరపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా నివేశన స్థలాలివ్వడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు