logo
Published : 02/12/2021 05:03 IST

చెట్టును ఢీ కొట్టిన కారు.. డ్రైవర్‌ మృతి

పట్నంబజారు (గుంటూరు), న్యూస్‌టుడే: ఒక వ్యక్తి కారు నడుపుతూ చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన గుంటూరులోని పులిపాక ఉన్నత పాఠశాల సమీపంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడలోని భవానీపురం సెంటర్‌కు చెందిన షేక్‌ మస్తాన్‌వలి (45) ఒక ట్రావెల్స్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బుధవారం గుంటూరు పట్టాభిపురంలో ఒకరికి కారు ఏర్పాటు చేసేందుకు విజయవాడ నుంచి బయలుదేరారు. పులిపాక ఉన్నత పాఠశాల సమీపంలో కారు ఒక్కసారిగా ఎడమ వైపునకు వెళ్లి చెట్టును ఢీ కొట్టింది. స్థానికులు చూడగా ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మస్తాన్‌వలి గుండెపోటుతో లేదా ఇతర కారణాలతో మృతి చెందారా? అనే విషయం పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని ట్రాఫిక్‌ సీఐ వీరనాయక్‌ తెలిపారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని