logo

ఐజీఎం స్టేడియంలో నమూనా వంతెన

నగరంలోని బెంజి సర్కిల్‌ వద్ద నిర్మించిన రెండో పై వంతెనను ఈనెల 10వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి రానున్నారు. ఈక్రమంలో ఆ రోజు చేయాల్సిన ఏర్పాట్లపై స్థానిక కలెక్టర్‌ విడిది కార్యాలయంలో

Published : 08 Dec 2021 05:13 IST

సమావేశంలో కృష్ణబాబు. ఎమ్మెల్సీ తలశిల, కలెక్టర్‌ నివాస్‌, జేసీలు మాధవీలత, శివశంకర్‌, వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తదితరులు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగరంలోని బెంజి సర్కిల్‌ వద్ద నిర్మించిన రెండో పై వంతెనను ఈనెల 10వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి రానున్నారు. ఈక్రమంలో ఆ రోజు చేయాల్సిన ఏర్పాట్లపై స్థానిక కలెక్టర్‌ విడిది కార్యాలయంలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం సాయంత్రం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. పైవంతెన ప్రారంభం, ఇతర పనులకు శంకుస్థాపన తదితరాలను నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ (ఐజీఎం) స్టేడియం నుంచి వర్చువల్‌ విధానంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియంలో మంత్రులు వచ్చే దారిలో 5 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవున నమూనా వంతెనను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం కేంద్ర మంత్రులు కనకదుర్గ అమ్మ వారిని దర్శించుకుని, దిల్లీకి వెళతారని వివరించారు. సమీక్షలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీలు కె.మాధవీలత, ఎల్‌.శివశంకర్‌, వీఎంసీ కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, డీసీపీ విష్ణువర్ధనరాజు, ఎన్‌.హెచ్‌. ఆర్వోలు ఆర్కే సింగ్‌, ఎస్‌కే సింగ్‌, పీడీ నారాయణ, డి.శ్రీనివాస్‌, వెంకటనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని