logo

special trains: ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు మండల రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో

Updated : 14 Jan 2022 07:43 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు మండల రైల్వే అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం- సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08579-08580) రైలును ఫిబ్రవరి 2 నుంచి 24వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం (08585-08586) రైలును ఫిబ్రవరి 1 నుంచి 23వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే రైలు(18463), బెంగుళూరు నుంచి భువనేశ్వర్‌కు వచ్చే రైలు(18464)కు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని