logo

చెత్త, వ్యర్థాల తొలగింపు

జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ సరిహద్దులో రోడ్డు పక్కన ఉన్న చెత్త, వ్యర్థాలను పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. స్వచ్ఛ సంకల్పం నినాదమేనా? అనే శీర్షికతో ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనానికి పంచాయతీ సర్పంచి వేల్పుల శ్రావణి

Published : 21 Jan 2022 04:47 IST

‘ఈనాడు’ కథనానికి స్పందన


శుభ్రం చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వెనిగండ్ల గ్రామ కార్యదర్శి విజయవర్ధిని తదితరులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ సరిహద్దులో రోడ్డు పక్కన ఉన్న చెత్త, వ్యర్థాలను పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. స్వచ్ఛ సంకల్పం నినాదమేనా? అనే శీర్షికతో ‘ఈనాడు’లో గురువారం ప్రచురితమైన కథనానికి పంచాయతీ సర్పంచి వేల్పుల శ్రావణి, కార్యదర్శి విజయవర్ధిని స్పందించి పారిశుద్ధ్య కార్మికులను పంపి చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. అనంతరం అక్కడికి వెళ్లి పరిశీలించారు. రోడ్డుకు కుడి వైపు భాగం పెదకాకాని గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పెదకాకాని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాగు చేయించారు. ప్రజలు చెత్త వేస్తే అపరాధ రుసుం విధిస్తామన్నారు. త్వరలో మొక్కలు నాటతామన్నారు. ప్రజలు హరిత రాయబారులకు తడి, పొడి చెత్తను ఇచ్చి స్వచ్ఛ గ్రామం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని