logo

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వ్యవసాయ సహాయకులు, ధాన్యం సేకరణ సిబ్బందితో శుక్రవారం టెలీ

Published : 22 Jan 2022 03:34 IST

మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వ్యవసాయ సహాయకులు, ధాన్యం సేకరణ సిబ్బందితో శుక్రవారం టెలీ కాన్పరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని 733 రైతు భరోసా కేంద్రాల్లో రైస్‌ మిల్లులను టాగింగ్‌ చేశామన్నారు. ఇప్పటి వరకు 9,673 మంది రైతుల నుంచి 60,018 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారన్నారు. రైతులకు 21 రోజుల లోపు వారి ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. 4 డివిజన్లలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరపై సిబ్బందికి సూచనలు చేసి అవగాహన కల్పించాలని చెప్పామన్నారు. డయల్‌ యువర్‌ కలెక్టరులో రైతుల నుంచి మూడు ఫిర్యాదులు రాగా రెండింటిని పరిష్కరించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని