logo

Anantapur: గోరుముద్ద తీరు చూడు జగనన్నా!

జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు కుళ్లిపోతుండటంతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వాటిని చెత్తపాలు చేస్తున్నారనడానికి నిదర్శనం ఈ చిత్రం.

Updated : 11 Oct 2023 08:40 IST

పురం పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు

జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు కుళ్లిపోతుండటంతో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వాటిని చెత్తపాలు చేస్తున్నారనడానికి నిదర్శనం ఈ చిత్రం. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధి ఎంజీఎం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో కుళ్లిన 200 కోడిగుడ్లను మంగళవారం చెత్తలో వేసి నిప్పటించారు. ఏజెన్సీల నిర్వాహకులు నాసిరకం, కాలం చెల్లిన వాటిని సరఫరా చేస్తుండటంతో నిల్వచేసిన కొన్ని రోజులకే కోడి గుడ్లు కుళ్లి దుర్వాసన వస్తుండటంతో పడేస్తున్నారు. ఎంఈవో ఏహెచ్‌ గంగప్ప ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ కుళ్లిపోయిన కోడిగుడ్ల స్థానంలో నాణ్యమైనవి అందిస్తామన్నారు.

 న్యూస్‌టుడే, హిందూపురం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని