logo

ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయం

పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు.

Published : 30 Apr 2024 04:49 IST

వెంకటాపురంలో మాజీమంత్రి పరిటాల సునీత సమక్షంలో చేరిన నాయకులు
అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), రామగిరి, న్యూస్‌టుడే: పార్టీలకు కార్యకర్తలు, నాయకులే బలం. వారు లేకపోతే పార్టీనే లేదు. ఏ రోజైనా మీ పార్టీ నాయకులను గౌరవించారా? గౌరవించి ఉంటే వైకాపాను వీడాల్సిన పనిలేదు. ప్రజలతోపాటు సొంత పార్టీ నాయకులను కూడా వేధిస్తున్నారు. అందుకే వారంతా తెదేపాలో చేరుతున్నారు. మళ్లీ వారిని భయపెట్టి, బెదిరిస్తే చూస్తూ ఊరుకోం. రాప్తాడు నియోజకవర్గం నీ సొంత జాగీరా? అంటూ మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటుగా విమర్శించారు. సోమవారం అనంతపురం, వెంకటాపురం క్యాంపు కార్యాలయాల్లో రాప్తాడు నియోజవర్గంలోని 80 కుటుంబాలు పార్టీలో చేరాయి. అనంతపురం క్యాంపు కార్యాలయంలో అక్కంపల్లి, భోగినేపల్లి, రాప్తాడు, కందుకూరు, పూలకుంట, గ్రామాలకు చెందిన 55 కుటుంబాలు, వెంకటాపురం క్యాంపు కార్యాలయంలో నసనకోట, కొత్తగాదిగకుంట, వెంకటాపురం, మాదాపురం, రామగిరి, తిమ్మాపురం గ్రామాలకు చెందిన 25 కుటుంబాలు పార్టీలో చేరారు. సునీత, తనయుడు సిద్ధార్థ సమక్షంలో కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి గెలుపు కోసం పని చేసిన వారు కూడా ఆయనను ఓడించాలని కోరుకుంటున్నారన్నారు. పరిటాల కుటుంబ సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రామగిరిలో శ్రీరామ్‌ సతీమణి జ్ఞాన, అనంతపురం గ్రామీణం అక్కంపల్లిలో పరిటాల రవీంద్ర సోదరి ఉష, చిన్నకోడలు తేజశ్వి, కురుగుంటలో పరిటాల శైలజ, తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. పరిటాల సునీతకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని