logo

బలిజలకు జగన్‌ వెన్నుపోటు పొడిచారు

గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్‌ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు.

Published : 01 May 2024 04:04 IST

రాష్ట్ర కాపు ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు

మాట్లాడుతున్న కాపు ఐకాస రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్‌, తదితరులు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: గత తెదేపా హయాంలో బలిజలను వెన్నుతట్టి ప్రోత్సహించారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్‌ వెన్నుపోటు పొడిచి బలిజలను సర్వం నాశనం చేశారని కాపు సంఘం రాష్ట్ర ఐకాస నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర కాపు ఐకాస నాయకులు జిల్లాకు వచ్చారు. అనంతపురం అర్బన్‌ తెదేపా కార్యాలయంలో మీడియాతో వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బలిజలకు జగన్‌ తీరని అన్యాయం చేశారన్నారు. రాజకీయాల్లో ఉత్తర రాయలసీమలో ఆరు జిల్లాలో బలిజలకు ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా-జనసేన కలిసి రాయలసీమలో మూడు సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్‌ రద్దు చేయడంతో 30 వేల ఉద్యోగాలు నష్టపోయామన్నారు. బీటెక్‌, ఇతర కోర్సుల్లో వేలాది మంది విద్యార్థులు సీట్లు కోల్పోయామన్నారు. తెదేపా హయాంలో 500 కాపు భవనాలు మంజూరు చేస్తే నిధులు ఇవ్వకుండా ఆపేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.2-3 లక్షల రుణాలు ఇవ్వడం జరిగిందని, విద్యార్థులకు విదేశీ విద్యకు విమానాలెక్కించారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమికి మద్దతునిచ్చామని బలిజలంతా ఒక్కసారి ఆలోచించాలని, అనంతపురంలో దగ్గుపాటిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాశ్‌, రామ్మూర్తి, గాజుల ఆదెన్న, రాయల్‌ మురళి, రవికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని