logo
Updated : 29/11/2021 06:36 IST

రేపు ‘జేబులో తుపాను’ పాకెట్‌బుక్‌ ఆవిష్కరణ 


సమావేశంలో మాట్లాడుతున్న సామాజిక ఉద్యమకారుడు భూమన్‌

తిరుపతి(గాంధీరోడ్డు): తెలుగు మహాకవి గురజాడ వర్ధంతి పురస్కరించుకొని మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో ఈనెల 30న ‘జేబులో తుపాను’ పాకెట్‌బుక్‌ను ఆవిష్కరించనున్నట్లు మానవ వికాస వేదిక సమన్వయకర్తలు సాకం నాగరాజు, డాక్టర్‌ సి.శైలకుమార్‌, సామాజిక ఉద్యమకారుడు భూమన్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కష్టజీవుల పక్షాన కలం పట్టి సామాజిక వ్యవస్థను ప్రళ్నించిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానమే తెలుగు సాహిత్యంలో పుట్టినదే జేబులో తుపాను అని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు, ప్రముఖ కవి కె.శివారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు కృష్ణాపురం ఠాణా నుంచి ఆర్టీసీ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు రచయితలు, మేధావులతో పుస్తకం ఊరేగింపు ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో సీనియర్‌ పాత్రికేయుడు రాఘవశర్మ, కార్మిక నేత తులశేంద్ర పాల్గొన్నారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని