logo

నియమావళి అమలు చేయాలనిపిస్తేగా?

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్‌ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి.

Published : 29 Mar 2024 02:46 IST

న్యూస్‌టుడే, పెనుమూరు: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి పది రోజులు దాటింది. కోడ్‌ను పక్కాగా అమలు చేయాల్సిన యంత్రాంగం కొన్నిచోట్ల తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నేటికీ కొన్నిచోట్ల అధికార వైకాపా రంగులు దర్శన మిస్తూనే ఉన్నాయి.  పెనుమూరు మండలం కలికిరి పంచాయతీ మొరవకండ్రిగ, గొల్లపల్లి వద్ద రక్షిత మంచినీటి ట్యాంకులకు వేసిన వైకాపా రంగులు తొలగించలేదు. మొరవకండ్రిగ పాఠశాల వద్ద రెండు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. పోలింగ్‌ రోజు ఈ రంగులు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానిక తెదేపా నాయకులు అంటున్నారు. తమ ఇళ్లపై ఉన్న తెదేపా జెండాలు తొలగించిన అధికారులు వైకాపా రంగులు ఎందుకు తొలగించ లేదని  ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని