logo

దోపిడీలు చేయడంలో డిగ్రీలు

ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.

Published : 29 Apr 2024 03:06 IST

సూళ్లూరుపేట ఎమ్మెల్యేపై బాలయ్య విమర్శలు 

వాహనంపై ర్యాలీగా వస్తున్న బాలకృష్ణ,
వరప్రసాద్‌రావు, నెలవల విజయశ్రీ, గంగాప్రసాద్‌

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు. ఆయన ఆదివారం సూళ్లూరుపేటలో కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక, గ్రావెల్‌, మట్టి మాఫియాలో ఎమ్మెల్యే సంజీవయ్య పెద్దతోపు అని ఎద్దేవా చేశారు. గతేడాది డిసెంబరులో మిగ్‌జాం తుపానుకు కాళంగి నది వరద అంతా సూళ్లూరుపేటలోకి చేరిందని, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని, దీనికి కారణం, పొర్లుకట్టలు నిర్మించకపోవడమేనని ఆయన విమర్శించారు. కాళంగి నదికి పొర్లుకట్లలు కట్టించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. కోడికత్తి, గొడ్డలి, గులకరాయి పేరుతో నటనలు చేయడం బాగా నేర్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేడ్కర్‌ విదేశీ విద్య, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, మైనార్టీ కార్పొరేషన్లు, తదితర కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి ఎంపీగా తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థిగా నెలవల విజయశ్రీకి ఓటు వేసి, గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి పరసా రత్నం, నియోజకవర్గ ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తెదేపా నేతలు కొండేపాటి గంగాప్రసాద్‌, భాజపా, జనసేన నేతలు పాల్గొన్నారు.

జగన్‌ నీ ఆటలు సాగవు.. రేణిగుంట: ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అదోగతి పట్టించిన జగన్‌ నీ ఆటలు ఇక సాగవని హిందూపురం, సినీ నటులు బాలకృష్ణ అన్నారు. ఆదివారం రేణిగుంటలో సభలో ఆయన మాట్లాడారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంచి పాలన అందించారన్నారు. ఆయన అడుగు జాడల్లో నడిచే ఆయన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డిని, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌రావును గెలిపించాలని కోరారు.

 

సూళ్లూరుపేట: సభకు హాజరైన జనసందోహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని