logo

హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి

‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి.

Published : 08 May 2024 06:09 IST

నియోజకవర్గ ప్రజలు నీకు బానిసలుగా ఉండాలా?
ఎన్నికల్లో చల్లా బాబు చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఖాయం
మంత్రి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు

పుంగనూరులో ప్రసంగిస్తున్న చంద్రబాబు

పుంగనూరు, న్యూస్‌టుడే: ‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. ఇదేమైనా నీ జాగీరా? మీ అబ్బ సొత్తా? మామిడి కాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి. అనుమతులు లేకుండా రిజర్వాయర్లు కట్టి.. రైతుల పొట్టగొట్టి వారిని ఊళ్ల నుంచి తరిమేయాలని చూస్తున్నారు. పెద్దిరెడ్డీ నీ కొవ్వు కరిగిస్తా’ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రి రామచంద్రారెడ్డిని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం పుంగనూరులోని ఎన్టీఆర్‌ కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ‘హలో పుంగనూరు.. బై బై పాపాల పెద్దిరెడ్డి’ అని చంద్రబాబు, సభకు వచ్చిన తెలుగుదేశం, జనసేన, భాజపా కార్యకర్తలు నినదించారు. కార్యకర్తల ప్రాణాలకు నా ప్రాణాలైనా ఇచ్చి కాపాడుకుంటానని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.


ప్రమాణం చేద్దామంటే మాట్లాడవేం? : కిరణ్ కుమార్‌రెడ్డి  

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించి ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘పెద్దిరెడ్డి  పాడి రైతుల నుంచి నాలుగేళ్లలో రూ.132 కోట్లు, మామిడి రైతుల నుంచి రూ.150 కోట్లు కమీషన్‌ వసూలు చేశారు. చంద్రబాబు హయాంలో ఏఐఐజీ నిధులతో రోడ్లు మంజూరైతే పుంగనూరు, తంబళ్లపల్లెలో వాటిని రద్దు చేసి మంత్రి కుటుంబ సంస్థ కమీషన్లు కొట్టేసింది. నేను ఎవరి కాళ్లో పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యానని పెద్దిరెడ్డి అన్నారు. నువ్వు డీసీసీ పదవికి ఎవరి కాళ్లు పట్టుకున్నావో అందరికీ తెలుసు. కాణిపాకంలో ప్రమాణం చేద్దామంటే ఆయన మాట్లాడరు. ఎన్నికల కౌంటింగ్‌ వరకు పుంగనూరు నియోజకవర్గంలో కేంద్ర బలగాలు పెట్టే బాధ్యత నాది’ అని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.


నేను ఓడిస్తా: చల్లా బాబు

‘1989 ఎన్నికల్లో పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను ఓడించారు. ఇప్పుడు మరోసారి నాకు, ఆయనకు పోటీ జరుగుతోంది. ఇప్పుడు నేను ఆయనను ఓడిస్తా. బెదిరించి ఓట్లు వేసుకోవడం, అక్రమాలకు పాల్పడటం ఇక సాగవు. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయం.’

పుంగనూరు సభకు హాజరైన తెదేపా శ్రేణులు, ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు