logo

‘కామాక్షి కేసులో నిందితులపై చర్యలు తీసుకోరా?’

బిక్కవోలు మండలం బలభద్రపరం శివారు మామిడితోటకు చెందిన కోటిపల్లి కామాక్షి కుటుంబ సభ్యులు సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి రాజమహేంద్రవరం వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Published : 06 Dec 2022 04:00 IST

ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబ సభ్యులు, ఇతరులు

బిక్కవోలు: బిక్కవోలు మండలం బలభద్రపరం శివారు మామిడితోటకు చెందిన కోటిపల్లి కామాక్షి కుటుంబ సభ్యులు సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి రాజమహేంద్రవరం వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కామాక్షి, ఆయన కుమారుడు మురళీకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయాన్నే మళ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నలుగురు తమ కుటుంబాన్ని ఎన్ని కష్టాలపాలు చేసిందీ వివరించారు. తమ తల్లి చనిపోయిన తరువాత కూడా మృతదేహాన్ని అప్పగించటానికి పోలీసులు తమను ఇబ్బంది పెట్టారని, నేరుగా శ్మశానానికే మృతదేహం తీసుకెళ్తామంటూ తమ మనోభావాల్ని దెబ్బతీశారని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అధికార పార్టీ అండదండలతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిందితులను కాపాడుతూ, కేసు నీరుగార్చటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని