మహానాడును చూసి వైకాపా బెంబేలు: బుచ్చయ్య
వైకాపా ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేశారని, దీన్ని చూసి ఆ పార్టీ బెంబేలు పడుతోందని.
మాట్లాడుతున్న బుచ్చయ్యచౌదరి
టి.నగర్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే:వైకాపా ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి మహానాడును విజయవంతం చేశారని, దీన్ని చూసి ఆ పార్టీ బెంబేలు పడుతోందని. రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. తన నివాసంలో బుధవారం బుచ్చయ్య చౌదరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ పతనం తప్పదని వస్తున్న సర్వేలతో ఆ పార్టీ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. అవినీతి, అక్రమాలతోనే జగన్ రెడ్డి పాలన సాగుతోందన్నారు. గత నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. ఆటవిక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారన్నారు. చంద్రబాబును హత్యచేయించే ఆలోచనలో భాగంగానే సీˆ్పకర్ తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ఆ పదవికి అనర్హుడన్నారు. మహానాడుకు సహకరించిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
‘కలెక్టరేట్ అవినీతిమయం’
కలెక్టర్ కార్యాలయం అవినీతి కంపు కొడుతోందని బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. కలెక్టర్ మాధవీలత వ్యవహార శైలిపై సూటిగా ఆరోపణలు చేశారు. ఎంపీ భరత్ చెప్పినట్లు వింటూ కార్యాలయాన్ని అవినీతిమయంగా మార్చేశారన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ కలెక్టరేటులో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదన్నారు. మహానాడు ముగిసిన వెంటనే తమ పార్టీ ఫ్లెక్సీలను ఆగమేఘాలపై తొలగించాలని కలెక్టర్ ఆదేశించడాన్ని ఆగ్రహించారు. ఆల్కటుగార్డెన్స్‌లో ఇళ్ల మధ్య క్వారీ ఇవ్వద్దని చెప్పిన్పటికీ, స్థానిక ఎంపీ మాట విని కలెక్టర్ అనుమతులు మంజూరు చేసి కోర్టు ఆగ్రహంతో అనుమతులు రద్దుచేశారన్నారు. జిల్లాలో రెవెన్యూ, ఇసుక, క్వారీల్లో జరిగే అవినీతిపై నిగ్గు తేల్చుతామన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై స్పందిస్తూ గాలి వాటానికి ఇలాంటి నాయకులు కొట్టుకుపోతారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.