logo

18 ఆమోదం.. 10 తిరస్కరణ..

కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్‌లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి,

Published : 27 Apr 2024 06:09 IST

కలెక్టరేట్‌లో నామపత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి నివాస్‌, ఎన్నికల పరిశీలకులు గణేశ్‌, పాల్గొన్న అభ్యర్థులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్‌లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్‌.గణేశ్‌ పర్యవేక్షణలో శిక్షణ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌ భావన, సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్వో డి.తిప్పేనాయక్‌ ఆధ్వర్యంలో నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. నామినేషన్లు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో 28 నామపత్రాలపై పరిశీలన చేశారు. వీటిలో 18 నామినేషన్లు అర్హమైనవిగా నిర్ధారించారు. వివిధ కారణాలతో 10 నామినేషన్లను తిరిస్కరించారు.  తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నామపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ఏడు నియోజకవర్గాల్లో 109 నామినేషన్లు ఆమోదం పొందగా, 29 వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి.  

ఈ కారణాలతో..: కాకినాడ పార్లమెంట్‌నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాల్లో పది తిరస్కరణకు గురయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి జనపరెడ్డి వెంకటరమణ సవరించిన అఫిడవిట్‌ అందచేయక, పది మంది ఓటర్లు ప్రతిపాదించక తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి కిరణ్‌కుమార్‌ యడవల్లి తన నామినేషన్‌ పత్రంలో సంతకం చేయలేదని, జనవాణిని పార్టీ అభ్యర్థి గోరింత అప్పలరాజు పది ఓటర్లతో ప్రతిపాదించలేదని, స్వతంత్ర అభ్యర్థి అంకాడి సత్తిబాబు నామపత్రం సక్రమంగా లేదని, జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి ఎ.వెంకన్నదొర నామపత్రం సక్రమంగా లేదని, వైకాపా అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్‌ బి-ఫారం సమర్పించడంతో చలమలశెట్టి వెంకటలక్ష్మి నామినేషన్‌ తిరస్కరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పళ్లంరాజు బి-పారం ఇవ్వడంతో మల్లిపూడి సురేశ్‌కుమార్‌ నామపత్రం తిరస్కరించారు. వివిధ కారణాలతో జక్రయ్య, కరణం త్రినాథ్‌, అనసూరి ఆదినారాయణ నామినేషన్ల తిరస్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని