logo

ఎన్నికల ప్రచారంలో సినీనటుడు శివాజీ సందడి

తాళ్లపూడి మండలంలోని గజ్జరంలో గురువారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచార కార్యక్రమానికి సినీనటుడు శివాజీ హాజరయ్యారు.

Published : 09 May 2024 20:27 IST

తాళ్లపూడి: తాళ్లపూడి మండలంలోని గజ్జరంలో గురువారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచార కార్యక్రమానికి సినీనటుడు శివాజీ హాజరయ్యారు. ఆయన రాకతో గజ్జరంలో ఉమ్మడి నాయకులు, కార్యకర్తల సందడి వాతావరణం నెలకొంది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం శివాజీని ముప్పిడి వెంకటేశ్వరరావు, స్థానిక తెదేపా, జనసేన, భాజపా నాయకులు శాలువాతో సత్కరించారు. ఆయన అభివాదం చేసుకుంటూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీపడ్డాయి. ఈ కార్యక్రమంలో కాకర్ల వంశీ, మల్లిపూడి బాబాజీరావు, గూడా నాగరాజు, గుడ్ల ప్రసాద్, మద్దుకూరి వీరవెంకటసత్యనారాయణ, దండమూడి శేషు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు