logo

అప్పుల ఆంధ్రాగా మార్చేశారు

ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 10 May 2024 05:39 IST

రాజానగరం, న్యూస్‌టుడే: ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. దివాన్‌చెరువు, రాజానగరం, పల్లకడియం, కానవరం, తుంగపాడు తదితర గ్రామాల్లో గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయిదేళ్లు గడిచినా వైకాపా పాలకులు రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయారన్నారు. తలలేని మొండెంగా ఆంధ్రప్రదేశ్‌ మిగిలిపోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి ఒక్క డీ…ఎస్సీ కూడా తీయలేదన్నారు. పరిశ్రమలు రాక విద్యావంతులు పొట్టచేత్తో పట్టుకుని వలసపోతున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు 22 లక్షల ఇళ్లు నిర్మిస్తామని నాలుగు లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టాలని కోరారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల్లో తన విజయాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు కుటల్రు పన్నుతున్నారన్నారు. తెదేపా రాజానగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర, భాజపా నాయకులు నీరుకొండ వీరన్నచౌదరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు