logo

Vinukonda: ఓటు వేస్తే ప్రమాణం చేయండి.. లేదంటే డబ్బు తిరిగివ్వండి.. బెదిరిస్తున్న షాడో సర్పంచి

వినుకొండ మండలంలోని మారుమూలన ఉన్న గ్రామంలో వారం రోజులుగా సర్పంచి కాని షాడో సర్పంచి గ్రామంలోని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

Updated : 26 May 2024 07:08 IST

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: వినుకొండ మండలంలోని మారుమూలన ఉన్న గ్రామంలో వారం రోజులుగా సర్పంచి కాని షాడో సర్పంచి గ్రామంలోని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైకాపా తరఫున నగదు పంపిణీ చేసి ఎన్నికల అనంతరం తమ పార్టీకి ఓటు వేయలేదనే అనుమానం వచ్చిన వారిని గుడికి రమ్మని పిలుస్తున్నాడు. గుడిలో వైకాపాకే ఓటు వేశానని ప్రమాణం చేయాలని లేదంటే ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని వేధిస్తున్నాడని వాపోతున్నారు. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల అధికారిని అడగగా ఫిర్యాదు చేస్తే ఎంతటి వారైనా కేసులు నమోదు చేస్తామని ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు.

చెరువు మట్టితోడేస్తున్న ఆ నేత..

ఆ గ్రామానికి ఆయనో నియంత.. ఆయన చెప్పిందే శాసనం.. గతేడాది ప్రభుత్వ చెరువులో పొక్లెయిన్లతో మట్టి తవ్వి లారీలతో తరలించి చెరువు మట్టిని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. జనసేనకు చెందిన సామాన్య కార్యకర్త మట్టి కుప్పల దగ్గర సెల్ఫీ దిగడంతో అతనిని కొట్టి బెదిరించాడు. దీంతో అక్రమ మట్టి వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసి చెరువును చూడటానికి విలేకర్లు వెళ్తే అక్కడ తన మనుషులు వచ్చిన వారిని ఫొటో తీసి ఆ నేతకు వాట్సప్‌లో పంపారు. వెంటనే ఆ నేత కారు, ద్విచక్ర వాహనాలలో మరి కొందరిని వెంట తీసుకుని వచ్చి బెదిరించడానికి ప్రయత్నించాడు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ, నిటిపారుదల అధికారులు చెరువును పరిశీలించడం కానీ మట్టిని తరలించిన వారిని ప్రశ్నించడం కానీ చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని