logo
Published : 03/12/2021 02:55 IST

యశ్వంత్‌రెడ్డికి పింఛన్‌ పునరుద్ధరణ


యశ్వంత్‌రెడ్డి తల్లి వెంకట సుజాతకు నగదు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది, వాలంటీరు

కర్లపాలెం, గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని కర్లపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన కప్పల యశ్వంత్‌రెడ్డి పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. తండ్రి చనిపోవడంతో తల్లి వెంకట సుజాత కుమారుడికి సేవలు చేస్తూ బతుకు పోరాటం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ వారికి చేదోడుగా నిలిచేది. రేషన్‌ కార్డులో ఉన్న ఆధార్‌, పింఛన్‌ కార్డులో ఉన్న ఆధార్‌ నంబరు తేడా ఉందనే కారణంతో అక్టోబరులో పింఛన్‌ నిలిపివేశారు. పింఛన్‌ని పునరుద్ధరించమని రెండు సోమవారాలు కలెక్టరేట్‌కి రాగా.. ఎమ్మెల్సీ కోడ్‌ అమల్లో ఉందని చెప్పి అధికారులు ‘స్పందన’ను నిర్వహించలేదు. అయినప్పటికీ యశ్వంత్‌రెడ్డిని భుజాల మీద మోసుకుంటూ అధికారులకు అర్జీ అందజేశారు. ఇదే విషయాన్ని నవంబరు 23న ‘పింఛన్‌ ఇచ్చి ఆదుకోరూ..’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో జిల్లా సంయుక్త కలెక్టరు జి.రాజకుమారి స్పందించి ఆధార్‌ ఆపరేటర్‌ని యశ్వంత్‌రెడ్డి గృహానికి పంపించి బయోమెట్రిక్‌, ఐరిస్‌ అప్‌డేట్‌ చేయించారు. వాలంటీర్‌, సచివాలయ సిబ్బందితో హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయించారు. జేసీ రాజకుమారి సిఫార్సు మేరకు సెర్ప్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్పందించి లోపాలు సరి చేసి పెన్షన్‌ని పునరుద్ధరించారు. గురువారం యశ్వంత్‌రెడ్డి గృహానికి వెళ్లి రూ.3 వేల నగదును అతడి తల్లి వెంకట సుజాతకు గ్రామ వాలంటీర్‌, సచివాలయ సిబ్బంది అందజేశారు. ‘ఈనాడు’ కథనానికి స్పందించిన జేసీ, అధికారులు సమస్య పరిష్కరించి మేలు చేశారు. దీంతో ఆ కుటుంబానికి ఊరట లభించినట్లయింది.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని