logo

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన శ్రీపెరంబదూర్‌ ఆంజనేయులు(35), ఉదయలక్ష్మి దంపతులు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. వ్యవసాయం వీరి జీవనోపాధి. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో

Published : 17 Jan 2022 02:33 IST

యడ్లపాడు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన శ్రీపెరంబదూర్‌ ఆంజనేయులు(35), ఉదయలక్ష్మి దంపతులు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. వ్యవసాయం వీరి జీవనోపాధి. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఉదయలక్ష్మి ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కొండమూరులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి గుంటూరులో ఉంటున్న ఆంజనేయులు శనివారం భార్య వద్దకు వెళ్లి తనతో రావాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించటంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు పురుగుల మందు తాగి ప్రకాశం జిల్లా మార్టూరులోని ఫ్లైఓవర్‌ వంతెన వద్ద పడిపోయాడు. చివరిగా తన స్నేహితుడికి సమాచారం అందించటంతో విషయం అతని భార్య, కుటుంబ సభ్యులకు తెలిపాడు. అనంతరం ఆంజనేయులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మార్టూరు ఎస్సై కె.రవీంద్రరెడ్డి కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

చిలకలూరిపేటలో మరొకరు..

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని గుర్రాలచావిడి పెద్దమసీదు వద్ద ఇది జరిగింది. అర్బన్‌ పోలీసుల వివరాల మేరకు.. నగరం మండలం సజ్జావారిపాలేనికి చెందిన షేక్‌ సుభాని(33)తో చిలకలూరిపేటకు చెందిన నజీమాతో వివాహం జరిగింది. చిలకలూరిపేటలోనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త సుభానీ లారీడ్రైవర్‌. తరచు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి భార్య నజీమా అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన సుభాని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని