పదేళ్ల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు
ఆమె తన గ్రామానికి చెందిన వారితో కలిసి కాకినాడలో పనుల కోసం వచ్చింది. తనతో వచ్చిన వారు రైలులో తిరిగి వెళ్లారు.
ప్రమీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న జిల్లా మహిళా,
శిశు సంక్షేమ శాఖ అధికారి మనోరంజని
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఆమె తన గ్రామానికి చెందిన వారితో కలిసి కాకినాడలో పనుల కోసం వచ్చింది. తనతో వచ్చిన వారు రైలులో తిరిగి వెళ్లారు. ఆమె ఆ రైలు ఎక్కలేకపోవడంతో రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటికి ఆమె వయసు 19 ఏళ్లు. అప్పటి నుంచి స్వధార్ హోంలో ఆశ్రయం పొందిన ఆమె సరిగ్గా పదేళ్ల తర్వాత అధికారుల చొరవతో మంగళవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం బెన్నడుగూడ గ్రామానికి చెందిన సవరం రంగయ్య, సిప్పిణి దంపతుల కుమార్తె ప్రమీల (29), పూర్ణారావు సంతానం. 2012లో ఆమె గ్రామస్థులతో కలిసి ఉపాధి కోసం కాకినాడ వచ్చారు. తిరిగి వెళ్లేటపుడు రైలు ఎక్కలేకపోవడంతో ఒంటరిగా ఉన్న ఆమెను గస్తీ కాస్తున్న పోలీసులు గుర్తించి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, ఎన్జీవోలకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి గుంటూరు జిల్లా తెనాలి జేఎంజే స్వధార్ హోంలో చేర్పించడంతో ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన వారి జాడ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినా నెరవేరలేదు. తల్లిదండ్రులు కూడా కుమార్తె ఆచూకీ కోసం ప్రయత్నించినా ఎక్కడ ఉన్నదీ తెలియలేదు. ఇటీవలే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి మనోరంజని, దిశ కేంద్రం లీగల్ కౌన్సిలర్ విజయలక్ష్మి స్వధార్ హోంని సందర్శించి దీర్ఘకాలం ఉంటున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ప్రమీల పదేళ్లుగా ఉంటున్న విషయం గుర్తించి ఆమెతో మాట్లాడి తల్లిదండ్రులు, సోదరుడు, బంధువులు, స్వగ్రామం తదితర వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన వివరాలను ఆ జిల్లా మహిళా, శిశు సంక్షేమం, దిశ కేంద్రం అధికారులతో పాటు సీతంపేట పోలీసుస్టేషన్ ఎస్‌ఐ దృష్టికి తీసుకెళ్లారు. వారు విచారణ చేయగా ప్రమీల తల్లిదండ్రుల గురించి తెలిసింది. అప్పటికే ఆమె తండ్రి రంగయ్య మృతి చెందగా.. తల్లి సిప్పిణి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. సోదరుడు పూర్ణారావు, బంధువు లింగారావు మంగళవారం గుంటూరు వచ్చారు. నగరంలోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణం దిశ కేంద్రంలో ప్రమీలను అన్న పూర్ణారావు, బంధువు లింగారావులకు అప్పజెప్పారు. తన సోదరుడు, బంధువులను చూసిన ఆమె సంతోషంతో వారిని హత్తుకుంది. పదేళ్ల తర్వాత తన తల్లి, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లడానికి కృషి చేసిన జిల్లా అధికారి మనోరంజని, లీగల్ కౌన్సిలర్ విజయలక్ష్మికి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరి వెళ్లారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: ‘జెలెన్స్కీని చంపబోమని పుతిన్ హామీ ఇచ్చారు!’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
Sports News
Cheteshwar Pujara: నా కెరీర్లో అత్యుత్తమ సిరీస్ అదే: ఛెతేశ్వర్ పుజారా
-
Crime News
Cyber Crime: ఈ-కామర్స్ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్ మోసం!
-
Movies News
Social Look: వేదిక అలా.. మౌనీరాయ్ ఇలా.. శ్రద్ధాకపూర్?
-
General News
Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!