Pawan Kalyan: వారాహిపై ఈనెల 14 నుంచి పవన్‌ పర్యటన: నాదెండ్ల

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహిపై ఈనెల 14 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. 

Published : 02 Jun 2023 21:25 IST

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహిపై ఈనెల 14 నుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. అన్నవరం సత్యదేవుని చెంత పూజలు నిర్వహించిన తర్వాత యాత్ర మొదలవుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. మొదటి విడతలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్‌ యాత్ర సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు యాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. పర్యటనలో భాగంగా వివిధ వర్గాల వారితో పవన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

పవన్‌ యాత్రపై చర్చించేందుకు నాదెండ్ల మనోహర్‌ పార్టీ ముఖ్య నేతలతో మంగళగిరిలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. వారితో చర్చల తర్వాత మొదటి విడత షెడ్యూల్‌, రూట్‌ మ్యాప్‌ ఖరారు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు సాగేలా యాత్ర ఉంటుందని మనోహర్ వివరించారు. ఇది ఎన్నికల కోసం జరిగే ర్యాలీ కాదని, ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా నింపే యాత్ర అని స్పష్టం చేశారు. యాత్రలో భాగంగా వివిధ వర్గాల వారితో సమావేశాలుంటాయన్నారు. తప్పనిసరిగా వారాహి యాత్ర రాష్ట్ర ప్రజల్లో చైతన్యం, ధైర్యం నింపనుందని విశ్వాసం వెలిబుచ్చారు. రాష్ట్ర అబివృద్ధి, భవిష్యత్తు కోసం జరుగుతున్న యాత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ రాష్ట్ర పర్యటన ఉంటుదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని