logo

కూటమి గెలుపు అభివృద్ధికి మలుపు

రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్‌ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 01 May 2024 05:33 IST

ఫిరంగిపురంలో  తెనాలి శ్రావణ్‌కుమార్‌ ప్రచారం

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని తాడికొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని రసూల్‌ పేట, కొత్తపేట, బీసీ కాలనీలో మంగళవారం తెదేపా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఎమ్మార్పీఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో..

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణను సాధించుకోవాలంటే రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్‌ యేసుపాదం అన్నారు. మంగళవారం రూరల్‌ మండలంలోని బొంతపాడులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మోషే, నాగేశ్వరరావు, రమేష్‌, శ్రీను, కోటేశ్వరరావు, శారద తదితరులు పాల్గొన్నారు.

పెదపలకలూరులో  రామాంజనేయులు, తాడిశెట్టి మురళి

ఇంటింటా ప్రచారం

గుంటూరు రూరల్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా కూటమి అధికారంలోకి రావడం ఏకైక మార్గమని ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు రూరల్‌ మండలంలోని పెద్దపలకలూరులో మంగళవారం పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.  మాజీ మేయర్‌ తాడిశెట్టి మురళి మోహన్‌, శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు మండలం అన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన 15 ఎస్సీ కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంగళవారం గుంటూరులో కూటమి అభ్యర్థి రామాంజనేయులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. 

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెంలో కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సతీమణి జయమ్మ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలకు కరపత్రాలను పంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని