logo

దివ్యాంగులు.. వృద్ధులకు వాహన సౌకర్యం

దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Published : 08 May 2024 06:03 IST

బాపట్ల, న్యూస్‌టుడే: దివ్యాంగులు, వృద్ధ ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేకంగా సక్షం యాప్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రంజిత్‌బాషా తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు ఓట్లు వేయటానికి తమ ఫోన్లలో సక్షం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. యాప్‌లో ఓటర్లు పేర్లు నమోదు చేయగానే వారి పోలింగ్‌ కేంద్రాల వివరాలు తెలుస్తాయన్నారు. ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి రావటానికి వాహనం కోసం యాప్‌లో అభ్యర్థన చేసుకోవచ్చన్నారు. మే 13న పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడు చక్రాల సైకిల్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. ఓటు వేసే సమయంలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు సహాయం అందిస్తారని తెలిపారు. ఈసీ కల్పించిన అవకాశాన్ని దివ్యాంగులు, వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు