logo

నా సోదరి మాధవిని గెలిపించండి

గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

Published : 10 May 2024 05:24 IST

ఓటర్లు, కూటమి శ్రేణులకు పవన్‌ కల్యాణ్‌ పిలుపు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్‌ కల్యాణ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ ‘గళ్లా మాధవి నా సోదరి సమానురాలు. ఆమెను ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని తెదేపా, జనసేన, భాజపా శ్రేణులకు పిలుపునిస్తున్నా. ముఖ్యంగా జన సైనికులు మాధవి విజయంలో కీలక పాత్ర పోషించాలి. గుంటూరు పశ్చిమలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే జిమ్మిక్కులను తిప్పి కొట్టాలి. పశ్చిమలో గెలిచి జనసేనలోకి వస్తామని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. గళ్లా మాధవికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా మాధవికి అండగా నిలవాలి’.. అని సూచించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు గళ్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు