logo
Published : 04/12/2021 01:13 IST

అభ్యున్నతిని అడ్డుకుంటే కఠిన చర్యలు

జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి

చిన్నారులు, తల్లులతో కలిసి అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించిన సునీతారెడ్డి

పెద్దేముల్‌, న్యూస్ టుడే: శిలాఫలకాలను ధ్వంసం చేసి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. ప్రజలకు సేవ చేసేందుకు, వారి పురోగతికి పోటీ పడాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీతారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రేగొండి, మంబాపూరు, మారేపల్లి, పెద్దేముల్‌, రుద్రారం, గాజీపూరు గ్రామాల్లో రూ.70 లక్షల విలువ చేసే అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. తాండూరు నియోజకవర్గానికి రూ.16 కోట్ల జడ్పీ నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. కొవిడ్, ఎన్నికల కారణంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు దూరంగా ఉన్నామని చెప్పారు. వారంలో మూడు రోజులు తాండూరులో పర్యటిస్తామని ఎవరికీ భయపడేది లేదన్నారు. అభివృద్ధికి అడ్డువచ్చే వారిపై కఠినచర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. శిలాఫలకం ధ్వంసం విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ఇలాంటి సంస్కృతికి దిగజారడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు స్వప్న, డీసీసీబీ డైరెక్టరు లక్ష్మారెడ్డి, సొసైటీ ఛైర్మన్లు రవి గౌడ్, విష్ణువర్ధన్‌ రెడ్డి, జడ్పీటీసీ మహిపాల్‌రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి, మండల కోఅప్షన్‌ సభ్యుడు నసీరుద్దీన్‌, సర్పంచులు హైదర్, విజయమ్మ, వీరప్ప, పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్, వైస్‌ ఎంపీపీ మధులత పాల్గొన్నారు.

పెద్దేముల్‌లో శిలాఫలకం ధ్వంసం: మండల కేంద్రం పెద్దేముల్‌లో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ప్రారంభానికి సిద్ధంగా ఉంచిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీతారెడ్డితో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పనులు చేసిన చోట శిలాఫలకాన్ని తెప్పించారు.  మండల కార్యాలయం వద్ద నిర్మించిన దుకాణ సముదాయానికి సంబంధించిన శిలాఫలకాన్ని గోడకు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో బండతో పగులగొట్టారు. ఈ సంఘటనతో  పోలీసులు అప్రమత్తమై మిగిలిన శిలాఫలకాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని గ్రామీణ సీఐ జలంధర్ రెడ్డి పరిశీలించారు. పంచాయతీ రాజ్‌ ఏఈ సిద్ధార్థ, తెరాస నాయకుడు నర్సింహులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని