logo

చిత్రవార్తలు

కార్గో గురించి ప్రజల మదిలో నాటుకుపోయేలా, చదువు ప్రాముఖ్యం విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది వేయించిన చిత్రాలు ఇవి. గౌలిగూడ సీబీఎస్‌ లోకల్‌ బస్టాండ్‌ వద్ద ఒక గదిలో కార్గో సర్వీసు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గోడపై వేసిన బస్సు బొమ్మ ప్రయాణికులను ఆకర్షిస్తుంది.

Updated : 25 May 2022 06:22 IST

కదలని బస్సు..

కార్గో గురించి ప్రజల మదిలో నాటుకుపోయేలా, చదువు ప్రాముఖ్యం విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఆర్టీసీ, ప్రభుత్వ పాఠశాల సిబ్బంది వేయించిన చిత్రాలు ఇవి. గౌలిగూడ సీబీఎస్‌ లోకల్‌ బస్టాండ్‌ వద్ద ఒక గదిలో కార్గో సర్వీసు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గోడపై వేసిన బస్సు బొమ్మ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. మరోవైపు సికింద్రాబాద్‌ ఓల్డ్‌ నల్లగుట్టలోని ప్రభుత్వ పాఠశాలకు ఆకాశమే హద్దుగా చదువుతో సాగిపో అంటూ వేసిన చిత్తరువు చూపరులను ఆకట్టుకుంటోంది.


పేదల పేరుతో పెద్దల ఆక్రమణ

మూసీలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతేడాది మూసారాంబాగ్‌ వంతెన మునిగి పైనుంచి వరద పోటెత్తింది. నది ఒడ్డున పేదల గుడిసెలు నీట మునగడంతో రెవెన్యూ అధికారులు స్పందించి నగర శివారు మునగనూరులో సుమారు 262 కుటుంబాలకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించారు. కొందరు స్థానిక నాయకులు మూసీకి మరో పక్క వారం రోజుల క్రితం తాత్కాలికంగా రేకుల షెడ్లు వేశారు. ఏమని అడిగితే తమకు రెండు పడకల ఇళ్లు కేటాయించలేదని సమాధానమిస్తున్నారు.  మూసారాంబాగ్‌ వంతెన సమీపంలో పలు అభివృద్ధి పనులు జరుగుతుండడంతో భూముల విలువ పెరుగుతోంది. మూసీపై కన్నేసిన కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని