టింబర్‌ డిపో లైసెన్సుకు లంచం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు టింబర్‌ డిపో ఏర్పాటుకు అనుమతిచ్చేందుకు రూ.80వేల తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరా ప్రకారం..

Updated : 26 May 2022 05:54 IST

అనిశాకు చిక్కిన అటవీ శాఖ అధికారులు

శ్యామ్‌కుమార్‌, పీర్యానాయక్‌

కాటేదాన్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు టింబర్‌ డిపో ఏర్పాటుకు అనుమతిచ్చేందుకు రూ.80వేల తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరా ప్రకారం.. కొత్వాల్‌గూడలో టింబర్‌ డిపో ఏర్పాటు కోసం వెంకటేష్‌ అనే కట్టెల వ్యాపారి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లి డివిజన్‌ గగన్‌పహాడ్‌లోని శంషాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో ఇటీవల దరఖాస్తు చేశారు. ఇందుకు రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌, సెక్షన్‌ అధికారి పీర్యానాయక్‌ రూ.80వేలు ఇస్తే లైసెన్స్‌ మంజూరయ్యేలా చేస్తామన్నారు. సరేనన్న వెంకటేష్‌ అనిశా అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయానికి వెళ్లిన వెంకటేష్‌ ఇద్దరు అధికారులకు రూ.80వేల నగదును అందించారు. అక్కడే వేచి ఉన్న అనిశా అధికారులు వారిపై దాడులు చేశారు. నగదుతో సహా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారాసిగూడలోని శ్యామ్‌కుమార్‌, షాద్‌నగర్‌లోని పీర్యానాయక్‌ నివాసాల్లో సోదాలు చేపడుతున్నామని డీఎస్‌పీ తెలిపారు. వారిని అనిశా కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని