Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో తెరాస అరాచకాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Published : 01 Jul 2022 16:48 IST

హైదరాబాద్‌: ప్రాజెక్టులు, సాగునీరు పేరుతో తెరాస అరాచకాలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల పేరిట వందల కోట్లు వెచ్చించి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పరిహారం అడిగిన నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసి, చేతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారని, సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సమంజసమా?అని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.  రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులు కోరకున్న విధంగా పరిహారం ఇవ్వాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టు రీడిజైన్‌తో ముంపు గ్రామాల సమస్య 1 నుంచి 8కి పెరిగిందని పేర్కొన్నారు. గౌరవెల్లిలో నాడు మైనర్లుగా ఉండి ఇప్పుడు మేజర్లయిన వారికి రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని