AirJapan: మద్యం మత్తులో పైలట్‌.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్‌

డాలస్‌ నుంచి టోక్యో వెళ్లాల్సిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. 

Published : 01 May 2024 15:16 IST

డాలస్‌: అమెరికాలోని డాలస్‌ నుంచి జపాన్‌ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్‌లోని హోటల్‌లో బస చేసిన విమాన పైలట్‌ ఫ్లైట్‌ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్‌ సిబ్బందితో, అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పైలట్‌ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్‌ అందుబాటులో లేని కారణంగా  విమానాన్ని  జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది. అనంతరం అందులోని 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్ లైన్స్‌ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది.

‘‘ఫ్లైట్‌ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము. మా సేవలపై నమ్మకాన్ని ఉంచండి ’’ అని ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని