logo

జలవిహార్‌.. కారు హుషార్‌

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు తెరాస ఘన స్వాగతం పలికింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా.. బోనాలు, కళా ప్రదర్శనలతోపాటు వేలాది మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. ఓ వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా..

Published : 03 Jul 2022 03:19 IST

ఈనాడు- హైదరాబాద్‌, బేగంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు తెరాస ఘన స్వాగతం పలికింది. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా.. బోనాలు, కళా ప్రదర్శనలతోపాటు వేలాది మందితో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించింది. ఓ వైపు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండగా.. ఇంకోవైపు రాష్ట్రపతి ఎన్నికల కోసం యశ్వంత్‌ సిన్హా పర్యటన ఉండడంతో ఇందుకు తెరాస ఘనంగా ఏర్పాట్లు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొలుత ఉదయం 11.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన సిన్హాకు.. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు స్వాగతం పలికారు. బేగంపేట- రాజ్‌భవన్‌- ఖైరతాబాద్‌ మీదుగా బైక్‌ ర్యాలీ జలవిహార్‌ వరకూ కొనసాగింది. దారి పొడవునా గులాబీ తోరణాలు, జెండాలు నిండిపోయాయి. నగర ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ర్యాలీని ముందుండి నడిపించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని