logo

భర్తకు తెలియకుండా భార్య రెండో వివాహం

విడాకులు ఇవ్వకుండానే భార్య రెండో పెళ్లి చేసుకొందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫస్ట్‌ లాన్సర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సుల్తాన్‌కు 2013లో రుబీనా బేగంతో

Updated : 12 Aug 2022 11:33 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: విడాకులు ఇవ్వకుండానే భార్య రెండో పెళ్లి చేసుకొందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫస్ట్‌ లాన్సర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సుల్తాన్‌కు 2013లో రుబీనా బేగంతో పెద్దల సమక్షంలో వివాహమైంది. ఆమె 2017లో ముబీనుద్దీన్‌ను రెండో వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మహ్మదీయ చట్టాన్ని పాటించకుండా ఖులా (విడాకులు) ఇవ్వకుండానే ఆమె మరొకరిని వివాహం చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రుబీనా బేగం వేధింపుల కింద తప్పుడు కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాను లైంగిక సామర్థ్య పరీక్షలు సైతం చేయించుకొని ధ్రువపత్రం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్యతో పాటు ఆమె తల్లి, సోదరుడు తనపై పలుమార్లు దాడికి పాల్పడ్డారని, వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో కోరారు. పోలీసులు రుబీనాబేగం, ఆమె తల్లి ముంతాజ్‌బేగంలతోపాటు కుటుంబ సభ్యులైన హైదర్‌ అలీ, యూసుఫ్‌పాషా, మహ్మద్‌ ఖాసీం, ముబీనుద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని