logo

నేటి నుంచి నగరమంతా సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఆదివారం (ఈనెల 25న) నుంచి ‘బతుకమ్మ పండగ’ సంబురాలు నిర్వహణకు నగరంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ శనివారం తెలిపారు.

Published : 25 Sep 2022 03:47 IST

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా ఆదివారం (ఈనెల 25న) నుంచి ‘బతుకమ్మ పండగ’ సంబురాలు నిర్వహణకు నగరంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ శనివారం తెలిపారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించి చివరి రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయని చెప్పారు. రవీంద్రభారతిలో మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా సాహిత్య అకాడమీ సారథ్యంలో ‘మహిళా కవయిత్రులు, రచయిత్రుల’ సదస్సు, తెలంగాణ అధికార భాషా సంఘం రవీంద్రభారతి నుంచి గన్‌పార్కు వరకు మహిళల ర్యాలీ, అమరవీరుల స్తూపం వద్ద బతుకమ్మ ఉత్సవం, సంగీత నాటక అకాడమీ సారథ్యంలో 26, 27, 28 తేదీల్లో కళా బృందాలు ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.  

ఎల్బీ స్టేడియంలో..: అక్టోబరు 3న ఎల్బీ స్టేడియం నుంచి మూడు వేల మంది మహిళలు, మూడు వేల బతుకమ్మలతో భారీ ఊరేగింపు,  వెయ్యి మంది వివిధ సంప్రదాయ జానపద కళాకారుల ప్రదర్శనతో ముగింపు ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. ఏటా మాదిరిగానే బతుకమ్మ ఫిల్మోత్సవ్‌ ఉంటుందని, సాంస్కృతిక శాఖ ద్వారా నైపుణ్యాలు. బతుకమ్మకు ప్రభుత్వం మొత్తం రూ.10 కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని